January 19, 2018

Select your Top Menu from wp menus
Header ad

మెదక్ లో మరోసారి ఘర్జించిన గులాబి

KCR in Medakతెలంగాణాలోని మేతుకుసీమపై మరోసారి గులాబి జెండా రెపరెపలాడింది. మొన్న శనివారం మెదక్ పార్లమెంట్ స్తానానికి జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ టిఅర్ఎస్ తరపున బరిలో నిలబడ్డ కొత్త ప్రభాకర్ రెడ్డి 3,61,227 ఓట్ల భారి మెజారిటీతో గెలుపొందారు. అధికార పక్షంపై మూడు పార్టీలు మూకుమ్మడిగా దాడి చేసినా లక్షల మెజార్టీతో గెలుపొంది తన సత్తా మరోసారీ చాటింది. టీఆర్‌ఎస్ దూకుడుకు విపక్షాలు బెంబేలెత్తాయి. జబ్బలు చరుచుకుని అవాకులు చెవాకులు పేలిన బీజేపీ, టీడీపీ నేతల నోర్లు మూతపడ్డాయి. అధికార పక్షాన్ని తప్పు పట్టిన కాంగ్రెస్‌కు ముఖం లేదు. తెలంగాణ పునర్‌నిర్మాణానికి టీఆర్‌ఎస్సే కరెక్ట్ అని దానికే పట్టం కట్టారు.

ఇంత భారి మెజారిటీతో గెలిపించినందుకు మెదక్ ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఅర్ ధన్యవాదాలు తెలిపారు. నేడు తెలంగాణా భావంలో పత్రికలవారితో మాట్లాడుతూ ఈ గెలుపు టిఅరేస్ ప్రభుత్వ భాద్యతలను మరింత పెంచిందని అన్నారు. ప్రతిపక్షాలు ఎంతటి దుష్ప్రచారాలకు పాల్పడిన కాని ప్రజలు మటుకు టిఅరేస్ పై విశ్వాసం ప్రకటించినందుకు తానూ రునపడి ఉంటానని తెలిపారు. ఈ విజయం ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదని. ఇకనైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమయిన పాత్రను పోషించాలని అన్నారు.

భారి మెజారిటీ 

పోలింగ్ శాతం తగినప్పటికి భారీ ఆధిక్యంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. 3,61,277 ఓట్ల మెజార్టీతో ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. గతంలో సీఎం కేసీఆర్ 3,97,029 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 10 లక్షల 46 వేల 80 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌కు 5,71,800 ఓట్లు, కాంగ్రెస్‌కు 2,10,523 ఓట్లు, బీజేపీకి 1,86, 334 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంతో బీజేపీ సరిపెట్టకుంది. మెదక్ లోక్‌సభ పరిధిలోని 7 సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ అత్యధిక మెజార్టీతో దూసుకెళ్లింది. నర్సాపూర్, సిద్ధిపేట, మెదక్, పటాన్‌చెరు, దుబ్బాక సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ మొదటి స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. జగ్గారెడ్డికి పట్టున్న సంగారెడ్డిలో, టీడీపీకి బలమున్న గజ్వేల్ సెగ్మెంట్లలో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ఓటింగ్ శాతం పెరిగింది.

Kotha Prabhakar Reddy

ప్రభాకర్ రెడ్డికి గెలుపు ధృవీకరణ పత్రం అందజేత

మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రం అందజేశారు. ఇవాళ ఉప ఎన్నికల ఫలితం ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల అధికారి గెలుపొందిన అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి ధృవీకరణ పత్రం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొని జైతెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.

సిద్ధిపేట సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌కు 76,733 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీఆర్‌ఎస్-93,759, బీజేపీ-17,026, కాంగ్రెస్‌కు -13,193 ఓట్లు వచ్చాయి. మెదక్ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్ 41,305 ఓట్ల మెజార్టీతో తన సత్తా చాటింది. టీఆర్‌ఎస్‌కు 76,945, బీజేపీకి 14,842, కాంగ్రెస్‌కు 35,640 ఓట్లు పోలయ్యాయి. సంగారెడ్డి పరిధిలో టీఆర్‌ఎస్ 19,149 ఓట్లతో మెజార్టీ సాధించింది. టీఆర్‌ఎస్‌కు 69,474, బీజేపీకి 50,625, కాంగ్రెస్‌కు 14,227 ఓట్లు వచ్చాయి. దుబ్బాక పరిధిలో కారు 67,366 ఓట్లతో ఆధిక్యం సాధించింది. టీఆర్‌ఎస్- 86,052, కాంగ్రెస్ -18,638, బీజేపీ -16048 ఓట్లు సాధించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *

Contact Us